వెంకట్రామిరెడ్డికి ఆ డబ్బులు ఎక్కడివి?... ఆయనను వదిలే ప్రసక్తే లేదు: రఘునందన్ రావు

14-06-2024 Fri 17:14 | Telangana
Advertisement
  • గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని వెంకట్రామిరెడ్డి చెప్పారన్న బీజేపీ నేత
  • లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా లేకుండా పీకేశామన్న రఘునందన్ రావు
  • కాళేశ్వరం అక్రమాలపై చర్యలకు సీఎం వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణ
  • హరీశ్ రావు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్న
  • తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆగ్రహం
  • ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపాటు
Advertisement
మెదక్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చెప్పారని... ఆ డబ్బులు ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంకట్రామిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టఫలితమే బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జెండా లేకుండా పీకేశామని... ఇక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

కాళేశ్వరం అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. నాటి మంత్రి హరీశ్ రావు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో తప్పులు చేసిన వ్యక్తి ఎందుకు కనిపించడం లేదన్నారు.

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని రఘునందన్ రావు విమర్శించారు. సుల్తానాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ముక్కుపచ్చలారని పసిపాపను రేప్ చేసి చంపేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణం జరిగితే షీ టీమ్‌లు ఏం చేస్తున్నాయి? సీసీ కెమెరాలు ఏవి? ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.
Advertisement
Raghunandan RaoBJPBRSRevanth Reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more