ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణం... హాజరైన మోదీ, నవీన్ పట్నాయక్

Mohan Majhi takes oath as 15th Odisha CM
  • ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ
  • మోహన్ చరణ్ మాఝీతో సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్
  • డీప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిడాలు ప్రమాణం
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రఘుబర్ దాస్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పలువురు ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రులుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిడాలు ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ప్రమాణ స్వీకార వేడుక జరుగుతోంది.

ఒడిశాకు మోహన్ మాఝీ 15వ ముఖ్యమంత్రి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 30వేల మందికి పైగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 67 ప్లాటూన్ల పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
Mohan Charan Majhi
Odisha
Narendra Modi
Naveen Patnaik

More Telugu News