హింసాత్మక ఘటనలపై పవన్ కల్యాణ్ స్పందించాలి: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
- జనసేనానికి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత
- హింసాత్మక ఘటనలకు తావులేదన్న పవన్ సందేశం పట్ల బాలినేని హర్షం
- ఒంగోలులో హింసాత్మక ఘటనలపై స్పందించాలంటూ విజ్ఞప్తి
"అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు" అని ట్వీట్‌లో బాలినేని రాసుకొచ్చారు.