పేరుమార్పుపై ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన!
- పిఠాపురంలో జనసేనానిని ఓడిస్తానని ముద్రగడ సవాల్
- పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం
- పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం
- అన్న మాట ప్రకారం ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన
కాగా, పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. అన్న మాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.