పెళ్లి బృందాన్ని తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది దుర్మరణం

Madhya Pradesh 13 dead 25 injured as tractor trolley overturns in Rajgarh
మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రాజ్‌గర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిలో 13 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని రాజ్‌గర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరిలో తల, ఛాతిపై గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం భోపాల్ తరలించామని తెలిపారు. త్రీవ గాయాలైన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్ నుంచి పెళ్లి బృందం వచ్చిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Go Back to Shorts
Madhya Pradesh
Tractor Overturns

More Telugu News