అన్నమయ్య జిల్లాలో తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వేదవతి
- సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
- వేదవతి స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరు
వేదవతి కొన్నాళ్లుగా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తిస్తోంది. ఇవాళ సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో సర్వీస్ తుపాకీతో అత్యంత సమీపం నుంచి కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. వేదవతి మృతిపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.