హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీ
- కిలో టమాటా ధర రూ. 60కు పెరుగుదల
- రూ. 200 దాటేసిన బీన్స్..కొత్తిమీర కట్ట రూ. 10
- హోల్‌సేల్ మార్కెట్లకు తగ్గిన కూరగాయల రాక
- వర్షాకాలం వరకు ఇంతేనంటున్న వ్యాపారులు
సాధారణంగా హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ. 2800 టన్నులకు అటూఇటుగా వస్తున్నాయి. మామూలుగా అయితే నగరానికి రోజుకు 3300 టన్నుల కూరగాయలు అవసరం. ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.