బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు
- ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
- హేమ సహా 86 మందికి నోటీసుల జారీ
- రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్‌లో ఆరో నిందితుడి అరెస్ట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.