పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణు దేశాయ్
- ప్రతిసారి ఆయనతో పోల్చడమేంటని ఆగ్రహం
- ఎంతోమందిని బ్లాక్ చేశా.. అయినా ఈ కామెంట్స్ ఆగడంలేదని ఆవేదన
- తాజాగా రేణు దేశాయ్ పెట్టిన వీడియోకు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్
రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోకు.. ‘మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్ పై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ‘నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు’ అంటూ జవాబిచ్చారు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని రాసుకొచ్చారు.