విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
- తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య
- అలా అనడం సమంజసం కాదన్న విజయశాంతి
- అది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని వెల్లడి
దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన చేయలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తుందన్నారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దక్షిణాది ఉన్న ప్రేమతో కౌంటర్ ఇచ్చారా? లేక కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించట్లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.