పులివర్తి నానిపై దాడి కేసు: ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి అరెస్ట్
- ఈ నెల 14న తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
- తాజాగా కేసులో పురోగతి
- 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన తిరుపతి ఏడీజే కోర్టు
- నిందితులను చిత్తూరు సబ్ జైలుకు తరలించిన పోలీసులు
పోలింగ్ ముగిసిన అనంతరం, ఈ నెల 14న పులివర్తి నాని తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో గాయపడిన పులివర్తి నాని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితులు ఈ దాడిలో గొడ్డళ్లు, కర్రలు, సమ్మెటలు వాడినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పులివర్తి నాని గన్ మన్ తలకు బలమైన గాయం అయింది.