ఐపీఎల్ 2024 పూర్తవ్వకుండానే వెళ్లిపోతున్న ఇంగ్లండ్ క్రికెటర్లపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర ఆగ్రహం
- ఆడితే సీజన్ మొత్తం పూర్తిగా ఆడాలన్న టీమిండియా మాజీ క్రికెటర్
- లేదంటే అసలు రావొద్దంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డ మాజీ ఆల్‌రౌండర్
- టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ మండిపడ్డాడు. ఐపీఎల్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతుండడంపై పఠాన్ ఈ విధంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా ఇంగ్లండ్‌కు చెందిన రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటులో లేడు. స్వదేశానికి వెళ్లిపోవడమే కారణంగా ఉంది. ఇక ఇంగ్లండ్‌కే చెందిన సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. అతడు కూడా స్వదేశం వెళ్లిపోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.