తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత... టీడీపీ నిరసనకారులపై లాఠీచార్జి
- తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
- రోడ్డుపై బైఠాయించిన టీడీపీ కార్యకర్తలు
- లాఠీచార్జితో చెదరగొట్టిన పోలీసులు
తొలుత సాధారణ పోలీసులు రాగా, వారితో టీడీపీ నేతలకు వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు. ఈ దశలో ప్రత్యేక బలగాలు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుకుపడ్డాయి.