ఓటు వేయకపోతే.. రేషన్ కట్.. జరిమానా కూడా?

13-05-2024 Mon 02:07 | Offbeat
Advertisement
  • జనమంతా తప్పనిసరిగా ఓటేసేలా పలు ప్రభుత్వాల చర్యలు
  • కొన్నిచోట్ల నామమాత్రపు జరిమానాలు.. కొన్నిచోట్ల జైలు శిక్ష
  • లేకుంటే ఓటు ఎందుకు వేయలేదో వివరణ ఇవ్వాల్సిన వైనం
Advertisement
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరుగుతోంది. పోలింగ్‌ రోజున కచ్చితంగా సెలవు ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశంతో చాలా కంపెనీలు సెలవులు ఇచ్చేశాయి. అదీ పోలింగ్‌ సోమవారం, దానికి ముందు ఆదివారం కూడా కలసి రావడంతో.. చాలా మంది ఎంటర్‌ టైన్‌మెంట్‌ కు ప్లాన్‌ చేసుకున్నారు. ఓటేస్తే వేద్దాం.. లేకుంటే సెలవును ఎంజాయ్‌ చేద్దాం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అదే ఓటేయకుంటే.. ఏదైనా శిక్షగానీ, ఫైన్‌ గానీ విధిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర లేదుగానీ.. కొన్ని దేశాల్లో ఓటేయకుంటే శిక్షలు తప్పవు. అవేంటో చూద్దామా..

  • అర్జెంటీనా: ఇక్కడ ఓటు వేయనివారు ఎందుకు వేయలేదనే కారణంతో ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిందే. దానిపై అధికారులు సంతృప్తి చెందితే వదిలేస్తారు. లేకుంటే ఫైన్‌ కట్టాల్సి వస్తుంది.
  • పెరూ: ఈ దేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఓటేసినట్టుగా స్టాంప్‌ వేసిన కార్డు ఇస్తారు. ఆ కార్డు చూపితేనే ప్రభుత్వం నుంచి రేషన్‌ సరుకులు, సేవలు అందుతాయి. లేకుంటే రేషన్‌ లేనట్టే. అంతేకాదు ఓటేయకుంటే కాస్త జరిమానా కూడా కట్టక తప్పదు.
  • సింగపూర్‌: ఇక్కడ ఓటేయనివారి పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. అలాంటి వారు ఏ ఎన్నికల్లో కూడా పోటీ పడటానికి చాన్స్‌ లేకుండా పోతుంది. అయితే వివరణ పత్రం రాసిచ్చి, కొంత ఫీజు కట్టి దరఖాస్తు చేసుకుంటే.. ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేస్తారు.
  • బెల్జియం: ఇక్కడ జనం ఓటేయకుంటే.. స్వల్పంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే నాలుగు ఎన్నికల్లో గానీ ఓటేయకపోతే.. జైలుకు వెళ్లక తప్పదు.
  • ఉత్తర కొరియా: పూర్తిగా నియంతృత్వ రాజ్యమైన ఈ దేశంలో పరిస్థితి మరీ దారుణం. ఫెడరల్‌ ఎన్నికల్లో అందరూ తప్పనిసరిగా ఓటేయాల్సిందే. లేకుంటే దేశ ద్రోహంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.
  • ఆస్ట్రేలియా: ఈ కంట్రీలో ఓటర్లు కచ్చితంగా ఓటేయాల్సిన పోలింగ్‌ ప్రాంతానికి చేరుకోవాల్సిందే. అక్కడికి వెళ్లాక వారు ఓటు వేయొచ్చు, వేయబోమని చెప్పొచ్చు. కానీ పోలింగ్‌ ప్రాంతానికి వెళ్లకుంటే మాత్రం.. రూ.2.5 వేల వరకు జరిమానా కట్టాలి. ఆ ఫైన్‌ కట్టకుంటే జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుంది.
  • బ్రెజిల్‌: ఈ దేశంలో 16 ఏళ్లకే ఓటు హక్కు వస్తుంది. ఎన్నికల్లో 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారు, 70 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఓటేయాలన్న రూలేమీ లేదు. మిగతా అందరూ ఓటేయాల్సిందే. లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుంది.
  • నౌరూ, ఉరుగ్వే, టర్కీ, లీచెన్‌ స్టీన్‌, లగ్జెంబర్గ్‌ తదితర దేశాల్లో ఓటేయనివారు తగిన వివరణ ఇవ్వాలి. అది సరిగా లేకుంటే జరిమానా కట్టాల్సి వస్తుంది.

మరెన్నో దేశాల్లోనూ కంపల్సరీ
ఇవేగాక.. బొలీవియా, బల్గేరియా, కోస్టారికా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈజిప్ట్‌, గ్రీస్‌, హొండూరాస్‌, ఇటలీ, లెబనాన్‌, లిబియా, మెక్సికో, పనామా, పరాగ్వే, థాయిలాండ్‌ వంటి దేశాల్లోనూ కంపల్సరీ ఓటింగ్‌ వ్యవస్థ ఉంది. కాకపోతే.. ఓటేయని వారిని స్వల్ప హెచ్చరికలతో వదిలేస్తారు. పెద్దగా ఫైన్లు, శిక్షలు ఉండవు.

కొన్ని మినహాయింపులు ఉంటాయి
ఓటు వేయకపోతే చర్యలు తీసుకునే దేశాల్లో కొన్ని మినహాయింపులు మాత్రం అమలు చేస్తారు. తీవ్ర అనారోగ్యం, వయసు మీదపడటం, మిలటరీ విధుల్లో ఉండటం, కీలకమైన మతపరమైన అంశాలు కావడం వంటి మినహాయింపులు ఉంటాయి.
Advertisement
voteLok Sabha PollsoffbeatElections

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more