Rajat Patidar: మరోసారి ఆకట్టుకున్న రజత్ పాటిదార్... ఆర్సీబీ భారీ స్కోరు

  • చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసిన ఆర్సీబీ
RCB scores 187 runs with Rajat Patidar innings

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో యువ బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ ఒకడు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ పాటిదార్ బ్యాట్ ఝళిపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. 

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 6 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో వచ్చిన రజత్ పాటిదార్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కాగా, ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ ఫీల్డర్లు అనేక క్యాచ్ లు జారవిడవడం బెంగళూరుకు లాభించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, రసిక్ సలామ్ 2, ఇషాంత్ శర్మ 1, ముఖేశ్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.

ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. పంత్ స్థానంలో అక్షర్ పటేల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News