జగన్ కు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్ ఎద్దేవా
- సీఎంను తాకిన గులకరాయి చాలా స్పెషల్ అంటూ వ్యంగ్యం
- అలాంటి రాళ్లతో రోడ్లు వేస్తే అద్భుతంగా ఉంటాయన్న యువనేత
- మంగళగిరి మండలంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వ్యాఖ్యలు
రచ్చబండలో ప్రజల సమస్యలు వింటూ..
నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేశ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కౌలు డబ్బులు సక్రమంగా అందడంలేదని రైతులు వాపోయారు. రాజధానిలో పింఛన్ డబ్బులు కూడా సకాలంలో అందడంలేదన్నారు. దీంతో లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిలో పేదలకిచ్చే రూ.5 వేల పింఛన్ పథకం కొనసాగిస్తామని, ఎప్పటికప్పుడు లబ్దిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న అసైన్డ్ రైతుల పింఛన్ ను వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ వివరించారు.