బీజేపీ ఎంపీ తేజస్విసూర్యపై కేసు నమోదు

Case is booked against Tejasvi Surya
  • మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు
  • తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసినట్లు ఈసీ వెల్లడి
  • ఈ నెల 25న సెక్షన్ 123 (3) కింద కేసు బుక్ అయిందన్న కర్ణాటక చీఫ్ ఎలక్షన్ అధికారి
బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదయింది. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. నిన్న జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశామని, ఈ నెల 25న సెక్షన్ 123 (3) కింద కేసు బుక్ అయిందని కర్ణాటక చీఫ్ ఎలక్షన్ అధికారి వెల్లడించారు. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి కేసు బుక్ చేశామని తెలిపారు.
Go Back to Shorts
BJP
Tejaswi Surya
Bengaluru
Lok Sabha Polls

More Telugu News