బీహార్‌లో జేడీయూ నేత హత్య .. ఉద్రిక్తత
- పెళ్లికి హాజరై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులే టార్గెట్‌గా కాల్పులు
- రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు
- స్థానికులు నిరసన తెలపడంతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
ఈ కాల్పుల ఘటనతో పున్‌పున్ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో 86వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి తర్వాత నిరసనకారులను పోలీసులు శాంతింపజేశారు.
సౌరభ్ కుమార్‌కు 2 బుల్లెట్ గాయాలయ్యాయని, అతడి స్నేహితుడు మున్మున్ కుమార్‌కు బుల్లెట్లు తగిలాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.