కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
- ఆగివున్న లారీని ఢీకొన్న కారు
- ప్రమాదంలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమం
- గురువారం తెల్లవారుజామున 65వ రహదారిపై ప్రమాదం
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతోందని చెప్పారు.
కాగా కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అతివేగం, డ్రైవర్‌కు నిద్రలేమి ప్రమాదానికి కారణాలుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.