CSK: సొంతగడ్డపై చెన్నైకి మొదట బ్యాటింగ్... ఇవాళ లక్నోతో మ్యాచ్

LSG won the toss and chose bowling against CSK
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సొంతగడ్డపై మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. 

ఓపెనర్ అజింక్యా రహానే తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. ఈ వికెట్ మాట్ హెన్రీకి దక్కింది. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 11 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (37 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (0 బ్యాటింగ్) ఉన్నారు.
Go Back to Shorts
CSK
Toss
Batting
LSG
Chennai
IPL 2024

More Telugu News