సొంతగడ్డపై చెన్నైకి మొదట బ్యాటింగ్... ఇవాళ లక్నోతో మ్యాచ్
- ఐపీఎల్ లో ఇవాళ సీఎస్కే × లక్నో
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
- 6 ఓవర్లలో 2 వికెట్లకు 49 పరుగులు చేసిన చెన్నై
ఓపెనర్ అజింక్యా రహానే తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. ఈ వికెట్ మాట్ హెన్రీకి దక్కింది. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 11 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (37 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (0 బ్యాటింగ్) ఉన్నారు.