ఐపీఎల్: చెన్నైపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్
- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
- ఇంకా కోలుకోని సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్
అటు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో జోసెఫ్ స్థానంలో మాట్ హెన్రీకి అవకాశం ఇచ్చారు. సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్ లోనూ ఆడడం లేదు. టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ ల్లో అమితవేగంతో బౌలింగ్ చేసి బ్యాట్స్ మన్లను బెంబేలెత్తించిన మయాంక్ అనూహ్యరీతిలో గాయపడ్డాడు. అతడి గాయంపై ఇంకా అప్ డేట్ రాలేదు.
టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 6 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది.