నామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

Lavu Srikrishnadevarayalu files nomination papers
  • నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • ఏపీలో నేటి నుంచి నామినేషన్ల పర్వం 
  • భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు
నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. 

"విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. ప్రతి క్షణం ప్రజల కోసమే, ప్రతి అడుగు పల్నాడు అభివృద్ధి కోసమే. నిరంతరం ప్రజాసేవలో ఉండేలా పల్నాడు ప్రజలందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని వారాల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
Advertisement
Lavu Sri Krishna Devarayalu
Nomination
Narasaraopet
MP
Lok Sabha Polls
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News