కూరగాయలు కొంటుండగా కుప్పకూలిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూరగాయలు కొంటుండగా కుప్పకూలిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి

Man collapses while buying vegetables and dies of heart attack
  • సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన
  • కూరగాయలు కొంటుండగా కుప్పకూలిన వ్యక్తి
  • గుండెపోటుతో మృతి చెందినట్టు ప్రాథమిక నిర్ధారణ
  • సీపీఆర్ చేసి కాపాడేందుకు విఫలయత్నం చేసిన స్థానికులు
  • సీసీ కెమెరాల్లో రికార్డైన సంఘటన
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడికక్కడే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలో జరిగింది.

బేతవోలు గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కూరగాయల కోసం స్థానిక మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఓ బండి వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తుండగా, ఉన్నట్టుండి అస్వస్థతకు గురై బండి కింద పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, శ్రీనివాస్‌ను బయటకు తీసి ప్రథమ చికిత్స (సీపీఆర్) చేశారు. ప్రాణం కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. శ్రీనివాస్ గుండెపోటు కారణంగా మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ విషాదకర సంఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
Advertisement
Bejawada Srinivas
Suryapet
Heart Attack
Buying Vegetables
Kodada
CCTV Footage

More Telugu News