విద్యుత్ తీగలకు చిక్కుకున్న ఇరాన్ డ్రోన్.. వైరల్ వీడియోలో నిజమెంత?
- ఇజ్రాయెల్ పైకి 300 లకు పైగా డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్
- వాటిలో ఒకటి విద్యుత్ తీగలకు చిక్కుకుందంటూ ప్రచారం
- ఫ్యాక్ట్ చెక్ లో ఆ డ్రోన్ ఇరాన్ ప్రయోగించలేదని తేలిన వైనం
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లక్ష్యం చేరలేక మధ్యలోనే చతికిలపడి ఇదిగో ఇలా విద్యుత్ తీగలకు చిక్కుకుందని ఆ ఫొటో కింద కామెంట్ కనిపిస్తోంది. అయితే, ఈ డ్రోన్ నిజంగా ఇరాన్ ప్రయోగించిందేనా.. ఫొటోలో కనిపించే ప్రాంతం ఇరాన్ భూభాగమేనా అని కొంతమంది ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది ఇరాన్ డ్రోన్ కాదని తేలింది. సిరియాలోని హసాఖా అనే ప్రాంతంలో తీసిన ఫొటో అని గుర్తించారు. ఆ డ్రోన్ ఏ దేశానిది, ఎవరు ప్రయోగించారనే వివరాలు తెలియలేదు.. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచే అది సోషల్ మీడియాలో ఉందని తేలింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది ఈ నెల 13న.. సో, ఈ డ్రోన్ ఇరాన్ ప్రయోగించింది కాదని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు స్పష్టం చేశారు.