నేటి నుంచి రాయలసీమలో బాలయ్య ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’

Balayya tour in Rayalaseema for nda candidates elections campaign
  • రాయలసీమలో ఎన్డీయే అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం
  • ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ప్రత్యేక బస్సు సిద్ధం
  • ఏప్రిల్ 19న నామినేషన్ వేయనున్న బాలయ్య
  • ఏప్రిల్ 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ఎన్డీయే అభ్యర్థుల కోసం రాయలసీమలో విస్తృత ప్రచారం చేయనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరిట ఆయన ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ఓ ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. ఇక ఏప్రిల్ 19న బాలయ్య హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఏప్రిల్ 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు.
Go Back to Shorts
Balakrishna
Rayalaseema
TDP-JanaSena-BJP Alliance
Election Campaign
Balayya Unstoppable

More Telugu News