కవిత పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా.. సీబీఐ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
- సీబీఐ అరెస్ట్ అక్రమమన్న కవిత పిటిషన్ పై విచారణ వాయిదా
- కేసులో ప్రధాన కుట్రదారు కవిత అన్న సీబీఐ
- శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారని కోర్టుకు తెలిపిన న్యాయవాదులు
వాదనల సందర్భంగా... ఈ కేసులో ప్రధాన కుట్రదారు కవిత అని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అప్రూవర్లుగా మారిన శరత్ చంద్ర, మాగుంట రాఘవ సెక్షన్ 161, 164 కింద వాంగ్మూలం ఇచ్చినప్పటికీ.. కవిత దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పారు. అభిషేక్ బోయినపల్లి హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని తెలిపారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్పారు. ఈ విషయం బుచ్చిబాబు వాట్సాప్ చాట్ లో బయటపడిందని చెప్పారు. శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారని తెలిపారు.