రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan greetings to Ram Charan
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్
  • బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన పవన్ కల్యాణ్
  • తండ్రికి తగ్గ తనయుడని కితాబు
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు. చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడని కితాబునిచ్చారు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయని... మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Advertisement
Pawan Kalyan
Janasena
Ramcharan
Tollywood

More Telugu News