పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు మెదక్ నుంచి అభ్యర్థి లేడు: రఘునందన్ రావు

22-03-2024 Fri 22:14 | Telangana
Advertisement
  • మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని ధీమా
  • ప్రాజెక్టుల్లో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన మాజీ కలెక్టర్‌ను అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటు అని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి కాకుండా సూట్‌కేసులు మోసేవాళ్లకు పదవులు ఇస్తున్నారని విమర్శ
Advertisement
పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా... పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు మెదక్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి కరవయ్యాడని మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం జిన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని నేడు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం సిగ్గుచేటు అని విమర్శించారు.

ఆ పార్టీలో కష్టపడిన వారికి కాకుండా సూట్‌కేసులు మోసేవాళ్లకు పదవులు ఇచ్చారు... ఇస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పోల్‌కు కట్టేసి కొడతామని చెబుతున్నారన్నారు. దేశ ప్రజలందరూ తన కుటుంబసభ్యులని ప్రధాని మోదీ అంటుంటే... కేసీఆర్ మాత్రం కవిత, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, వాళ్ల కుమారులే తన కుటుంబ సభ్యులని చెబుతారని ఎద్దేవా చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడైనా మెదక్ జిల్లాకు వచ్చారా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా మోదీని మూడోసారి ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు.
Advertisement
Raghunandan RaoBJPMedak DistrictLok Sabha Polls

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more