ఐపీఎల్-2024 ట్రోఫీతో వివిధ ఫ్రాంచైజీల కెప్టెన్ల ఫొటో షూట్

IPL Captains poses with winner trophy
  • రేపటి నుంచి ఐపీఎల్
  • తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ
  • భారత్ లో ఎన్నికల కోలాహలం... అదే సమయంలో ఐపీఎల్
దేశంలో ఓవైపు ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా, క్రీడా వినోదం అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ఐపీఎల్ 17వ సీజన్ రేపే ప్రారంభం కానుంది. 10 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ సంకుల సమరం క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. 

తాజాగా, ఐపీఎల్-2024 ట్రోఫీతో ఆయా ఫ్రాంచైజీల సారథులు ఫొటోలకు పోజులిచ్చారు. ప్యాట్ కమిన్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్), హార్దిక్ పాండ్యా (ముంబయి ఇండియన్స్), ఢిల్లీ క్యాపిటల్స్ (రిషబ్ పంత్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), గుజరాత్ టైటాన్స్ (శుభ్ మాన్ గిల్), ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), శ్రేయాస్ అయ్యర్ (కోల్ కతా నైట్ రైడర్స్) ఈ ఫొటోషూట్ కు హాజరయ్యారు. 

పంజాబ్ కింగ్స్ తరఫున వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ హాజరయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అంటూ ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియాలో పేర్కొన్నప్పటికీ, చెన్నై ఫ్రాంచైజీ నుంచి దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. 

కాగా, రేపు (మార్చి 22) ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
Go Back to Shorts
IPL-2024
Captains
Trophy
Cricket
India

More Telugu News