మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ బుక్ విడుదల చేసిన విష్ణు... ఉచితంగా ఎలా పొందాలంటే...!

Manchu Vishnu launched Kannappa comic book on his father Mohan Babu birthday
  • తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కోసం తీవ్రంగా కృషి చేస్తున్న మంచు విష్ణు
  • మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు
  • కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్-1 ఆవిష్కరణ
  • ఇన్ స్టాగ్రామ్ లో డీఎం చేసిన వారికి ఉచితంగా పుస్తకం 
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. కాగా, తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న 'కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1'ను మంచు విష్ణు ఆవిష్కరించారు. ఇది భక్త కన్నప్ప గాథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఈ కామిక్ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించాలన్నది ఆయన ఆలోచన. 

ఇన్ స్టాగ్రాంలో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసేజ్ చేసిన వారికి ఈ పుస్తకాలు ఉచితంగా అందుతాయి. 

నేను డబ్బు కోసం ఈ పనిచేయడంలేదు: మంచు విష్ణు

ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. ఈ కామిక్ పుస్తకం సినిమా లాగా ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. 

ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను... అని వివరించారు.

ఘనంగా మోహన్ బాబు జన్మదిన వేడుకలు

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మోహన్ బాబు జన్మదిన వేడుకలు, మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మోహన్‌లాల్ గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, టాలీవుడ్ విలన్ పాత్రల నటుడు ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
Go Back to Shorts
Kannappa
Comic Book
Manchu Vishnu
Mohan Babu
Birthday

More Telugu News