ఆ క్ష‌ణాలు ఎంతో ప్ర‌త్యేకం.. మ‌హిళా దినోత్స‌వంపై స‌చిన్ స్పెష‌ల్ ట్వీట్

Sachin Tendulkar Special Tweet on World Women Day
  • 2008లో ఇంగ్లండ్‌పై విజ‌యం త‌ర్వాత‌ జ‌రిగిన ఆసక్తిక‌ర‌ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన స‌చిన్‌
  • మ‌హిళా గ్రౌండ్ స్టాఫ్ వ‌చ్చి అభినందించడం మ‌రిచిపోలేన‌న్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
  • భార‌త‌ మొద‌టి మ‌హిళా పిచ్ క్యురేట‌ర్ జ‌సింత క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న‌
ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్పెష‌ల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. స‌చిన్ చేసిన ఆ స్పెష‌ల్ ట్వీట్‌లో ఏముందంటే..  'ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. 2008లో 26/ 11 ఘ‌ట‌న త‌ర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆ జ‌ట్టుపై విజ‌యం సాధించిన‌ప్పుడు ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. టీమిండియా గెల‌వ‌గానే ఓ మ‌హిళా గ్రౌండ్ స్టాఫ్ వ‌చ్చి అభినందించారు. ఆ క్ష‌ణాలు చాలా ప్ర‌త్యేకం. ఆ క్ష‌ణాలు మ‌దిలో ఎప్ప‌టికీ మ‌ధుర జ్ఞాప‌కాలుగా అలా మిగిలిపోతాయి. ఆ త‌ర్వాత‌ ఏళ్లు గ‌డిచాయి. తిరిగి 2024లో ఏకంగా ఓ మ‌హిళ పిచ్ క్యురేట‌ర్ అయ్యారు. జ‌సింత క‌ళ్యాణ్ అనే మ‌హిళ భార‌త్‌కు మొద‌టి పిచ్ క్యురేట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అడ్డంకుల‌ను దాటుకుని రోల్ మోడ‌ల్స్‌గా నిలుస్తున్న మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హిద్దాం' అని స‌చిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Sachin Tendulkar
Tweet
World Women's Day
Cricket
Sports News

More Telugu News