ధర్మశాల టెస్టులో గిల్, రోహిత్ సెంచరీల వరద.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 264/1
- తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
- బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న రోహిత్, గిల్
- లంచ్ సమయానికి 46 పరుగుల ఆధిక్యంలో భారత్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిన్న తన తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలీ చేసిన 79 పరుగులే అత్యధికం. టీమిండియా బౌలర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్ పోటీపడి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే చాపచుట్టేసింది. కుల్దీప్ 5, అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు.