ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై?.. ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్
- కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం వేచిచూడలేకపోతున్నానంటూ ధోనీ పోస్ట్
- రిటైర్ కాబోతున్నాడని ఊహాగానాలు
- కోచ్‌గా లేదా మెంటార్‌గా వ్యవహరించనున్నాడని అభిప్రాయపడుతున్న ఫ్యాన్స్
కాగా ఐపీఎల్-2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడని అంతా భావించారు. 2023లోనే రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ ధోనీ నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే అతడి ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో ఆడడం ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలో ధోనీ పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ని ధోనీ ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.