ఈ జీడీపీ డేటా చూస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ సత్తా ఏమిటో అర్థమవుతుంది: ప్రధాని మోదీ
- మూడో త్రైమాసికంలో 8.4 శాతం జీడీపీ నమోదు
- గతేడాది ఇదే త్రైమాసికంలో 4.3 శాతం జీడీపీ నమోదు
- అంచనాలను మించిపోయిన తాజా జీడీపీ
దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ సత్తా ఏమిటో ఈ జీడీపీ డేటా చూస్తేనే అర్థమవుతుందని మోదీ స్పష్టం చేశారు. ఆ గణాంకాలు భారత ఆర్థిక శక్తిసామర్థ్యాలను చాటుతున్నాయని వివరించారు.
సత్వర ఆర్థికాభివృద్ధి కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని, 140 కోట్ల మంది భారతీయులు మెరుగైన జీవనం గడిపేలా వికసిత్ భారత్ సృష్టి మన ఆర్థిక వ్యవస్థ దోహదపడుతుందని వివరించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. తయారీ రంగం, గనులు, తవ్వకాలు, నిర్మాణ రంగాలు ఊపుమీదుండడం మూడో త్రైమాసికంలో అధిక జీడీపీ నమోదుకు కారణమైంది.