పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే ఆ పాత్ర ఒక్కటే సరిపోతుంది: పేర్ని నాని
- తాడేపల్లిగూడెం సభలో తనను తాను వామనుడితో పోల్చుకున్న పవన్
- పవన్ వామనుడు కాదు శల్యుడు అన్న పేర్ని నాని
- శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని పవన్ పై విమర్శలు
- నిన్నటి సభలో అన్నీ సొల్లు మాటలు చెప్పారని ఎద్దేవా
కనీసం చంద్రబాబు నిన్నటి సభలో పవన్ ను పొగుడుతూ ఒక్క మాట కూడా చెప్పలేదని, కానీ పవన్ మాత్రం చంద్రబాబు కోసం నాలుక మడతేశాడని పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ చెప్పినవన్నీ సొల్లు మాటలేనని అన్నారు. చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ కల్యాణ్ పని అని వ్యాఖ్యానించారు. నిన్నటి సభలో పవన్ సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టునే చదివారని, సినిమా డైలాగులు బట్టీ కొట్టి వచ్చారని పేర్ని నాని విమర్శించారు.
నువ్వు 24 తీసుకుంటావో, 4 తీసుకుంటావో, లేక 2 సీట్లు తీసుకుంటావో... మాకెందుకు బాధ? జగన్ వద్ద బేరాలు ఉండవమ్మా... పవన్ కల్యాణ్ కు చేతనైంది చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గురించి టన్నుల కొద్దీ సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.