నా దృష్టిలో లోకేశ్ దేవుడు... అందుకే ట్రైలర్ లో చూపించలేదు: వర్మ

Ram Gopal Varma describe Lokesh as God
  • రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం చిత్రం
  • ఫిబ్రవరి 23న విడుదల
  • ట్రైలర్ లో లోకేశ్ ను చూపించలేదేంటని మీడియా ప్రశ్న
  • లోకేశ్ దేవుడు కాబట్టి కించపర్చలేమన్న వర్మ 
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వ్యూహం సినిమా ట్రైలర్లలో లోకేశ్ ను చూపించలేదు... ఎందుకు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... నా దృష్టిలో లోకేశ్ దేవుడు అని వర్మ బదులిచ్చారు. దేవుడ్ని కించపర్చకూడదు కాబట్టే లోకేశ్ ను చూపించలేదు... లోకేశ్ ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి... మనిషి రూపంలో లేకుండా ఆయన ఒక వాయిస్ లాగా వినిపిస్తుంటాడంతే అంటూ తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. 

కాగా, వ్యూహం చిత్రానికి కొనసాగింపుగా వర్మ శపథం చిత్రాన్ని కూడా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. శపథం చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ట్రైలర్లను కలిపి విడుదల చేశారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Nara Lokesh
God
Vyuham
Andhra Pradesh

More Telugu News