YCP Candidates: ఏపీ సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ

Rajya Sabha Contestents Meet Jagan Before Filing Nomination
షార్ట్స్‌లో చూడండి
రాజ్యసభ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు ముగ్గురూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. రాజ్యసభ లోని మూడు సీట్లకు పోటీ చేయడానికి వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను వైసీపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం నివాసంలో జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన మూడు సీట్లకు టీడీపీ పోటీపడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
YCP Candidates
Rajya Sabha Polls
YV Subba Reddy
meda Raghunath Reddy
baburao

More Telugu News