అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు

Vijay Poverty Claims Criticized by Classmate Manu Joseph
  • పేదరికం చూశానన్న సీఎం విజయ్ వ్యాఖ్యలపై వివాదం
  • విజయ్ మాటలను 'బుల్‌షిట్' అంటూ కొట్టిపారేసిన క్లాస్ మేట్ మను జోసెఫ్
  • విజయ్ తండ్రి ఫిలింమేకర్, ఆయన్ను సినిమాలకు సిద్ధం చేశారని వెల్లడి
  • చెన్నైలోని లయోలా స్కూల్లో ఇద్దరం క్లాస్‌మేట్స్ అని పేర్కొన్న మను
  • ధనవంతులు 'దివాలా' తీయడాన్ని పేదరికంతో పోల్చవద్దని హితవు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్, తన బాల్యం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను పేదరికం చూశానని, ఆకలి అంటే ఏంటో తెలుసని ఆయన చేసిన ప్రసంగాన్ని.. ఆయన క్లాస్ మేట్, ప్రముఖ స్క్రీన్ రైటర్ మను జోసెఫ్ 'బుల్‌షిట్' (అర్థం పర్థం లేని వాగుడు) అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఈ మేరకు మను జోసెఫ్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "విజయ్ మూడో తరగతిలో నా క్లాస్‌మేట్. మేమిద్దరం చెన్నైలోని సుప్రసిద్ధ లయోలా స్కూల్‌లో చదువుకున్నాం. అతని తండ్రి ఒక ఫిలింమేకర్. తన కొడుకును సినిమాల కోసమే తీర్చిదిద్దారు. అతను పేదరికంలో పెరిగానని చెప్పడంలో అర్థంలేదు" అని  పేర్కొన్నారు. "చాలా మంది ఫిలింమేకర్ల లాగే విజయ్ తండ్రికి ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. కానీ అది తమిళనాడు స్థాయిలో పేదరికం కాదు. ధనవంతులు ఆర్థికంగా దెబ్బతినడాన్ని, నిజమైన పేదరికంతో పోల్చకూడదు. రెండూ వేర్వేరు" అని జోసెఫ్ వివరించారు.

ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ.. "నేను ఒక సాధారణ సినీ అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుగా పుట్టాను. పేదరికం, ఆకలి నాకు తెలుసు. నేనేమీ రాజవంశం నుంచి రాలేదు, నేనూ మీలో ఒకడినే" అని భావోద్వేగంగా ప్రసంగించారు.

విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 1974 వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, 1978లో దర్శకుడిగా మారారు. విజయ్ తన తండ్రి దర్శకత్వంలోనే బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తెరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Vijay
Tamil Nadu CM
Manu Joseph
Tamil Cinema
Poverty
Tamilaga Vettri Kazhagam
S A Chandrasekhar
Loyola School Chennai
Tamil Politics

More Telugu News