ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం
- ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- రైల్వే కానిస్టేబుల్ ట్రెయిను దిగుతుండగా ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ
- కానిస్టేబుల్ ఛాతిలోకి తూటా దూసుకుపోవడంతో మృతి
- అక్కడే ఉన్న ప్రయాణికుడికీ తూటా గాయం, ఆసుపత్రిలో చికిత్స
బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కడుపులో గాయమైన ప్రయాణికుడికి చికిత్స కొనసాగుతోంది. మృతుడిది రాజస్థాన్ అని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.