AP Assembly Speaker: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు పంపిన స్పీకర్

AP Assembly Speaker sent notice to YSRCP rebel MLAs
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు మరోసారి నోటీసులు పంపారు. బహిష్కృత ఎమ్మెల్యేలకు ఇదివరకే పలుమార్లు నోటీసులు పంపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలవగా, వైసీపీ రెబెల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Go Back to Shorts
AP Assembly Speaker
Notice
YSRCP Rebel MLAs
Andhra Pradesh

More Telugu News