కేజ్రీవాల్ చుట్టూ మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. వ్యక్తిగత కార్యదర్శి సహా మరికొందరిపై ఈడీ దాడులు

06-02-2024 Tue 11:35 | National
Advertisement
  • ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని 12 చోట్ల దాడులు
  • మనీలాండరింగ్ కేసులో పట్టుబిగుస్తున్న ఈడీ
  • ఐదోసారీ ఈడీ సమన్లను స్కిప్ చేసిన అరవింద్ కేజ్రీవాల్
  • ఆ వెంటనే ఈడీ దాడులు
Advertisement
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శితోపాటు ‘ఆప్’తో సంబంధం ఉన్న మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించింది. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలోని మొత్తం 12 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 

 కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఢిల్లీ జల్‌బోర్డ్ (డీజేబీ) మాజీ సభ్యుడు షలభ్ కుమార్‌తో మరికొందరి ప్రాంగణాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే, ఆప్ ట్రెజరర్, రాజ్యసభ సభ్యుడు ఎన్‌డీ గుప్తా ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను ఐదోసారీ కేజ్రీవాల్ విస్మరించిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం.
Advertisement
Arvind KejriwalNew DelhiMoney Laundering CaseAAP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more