ఈడీ సమన్ల కేసు.. సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ వాయిదా
- ఈ నెల 16న విచారిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం
- గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు పరిశీలించాలన్న ధర్మాసనం
- నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.