'మలైకోటై వాలిబన్' అఫిషియల్ ట్రైలర్ ను పంచుకున్న చిరంజీవి

Chiranjeevi presents Mohan Lal Malaikottai Valiban
  • మోహన్ లాల్ కథానాయకుడిగా మలైకోటై వాలిబన్
  • లిజో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వంలో భారీ చిత్రం
  • జనవరి 25న రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన కొత్త చిత్రం మలైకోటై వాలిబన్. తెల్లదొరల పాలన నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

"మలైకోటై వాలిబన్ అఫిషియల్ ట్రైలర్ ఇదిగో. ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్ కు, లిజో జోస్ పెల్లిస్సెరీకి, చిత్రబృందానికి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మలైకోటై వాలిబన్ చిత్ర ట్రైలర్ వీడియో లింకును కూడా పోస్ట్ చేశారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మోహన్ లాల్ సరసన సోనాలీ కులకర్ణి కథానాయిక. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు.
Advertisement
Malaikottai Valiban
Mohan Lal
Official Trailer
Chiranjeevi
Tollywood

More Telugu News