నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు
- కుటుంబంతో కలిసి హాజరైన తెలుగుదేశం బాస్
- సత్యమ్మ, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
- తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి
ఏటా సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో జరుపుకోవడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా పండుగకు ఆయన కుటుంబంతో కలిసి ఆదివారం హెలిక్యాప్టర్ లో ఏ.రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. స్థానిక నేతలు చంద్రబాబు, లోకేశ్ లకు స్వాగతం పలికారు. ఆక్కడి నుంచి కార్లలో నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా దేవాన్ష్ తదితరులు రెండు రోజుల క్రితమే నారావారిపల్లెకు వచ్చారు.