కాసేపట్లో చంద్రబాబును కలుస్తున్న వైఎస్ షర్మిల
- హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న షర్మిల
- కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న కాంగ్రెస్ నాయకురాలు
- ఇటీవల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల
మరోవైపు క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు, షర్మిలకు కూడా గిఫ్ట్ పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధం నెలకొంది.
అట్లూరి ప్రియను రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.