వరంగల్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్

Big shock for Congress in Warangal
  • కాంగ్రెస్ లో చేరనున్న వరంగల్ కార్పొరేటర్లు, నేతలు
  • సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు
  • వరంగల్ మేయర్ పై అవిశ్వాసం పెట్టే దిశగా అడుగులు
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోంది. వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు కొండా సురేఖ, కొండా మురళితో టచ్ లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నలుగురు గెలిచారు. ఇప్పుడు సగానికి పైగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
Advertisement
BRS Corporators
Warangal
Congress
Revanth Reddy

More Telugu News