న్యూఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమించిన పబ్ లపై కేసు
- జూబ్లీహిల్స్ లో ఆరు పబ్ లపై కేసు నమోదు
- నిర్ణీత సమయం దాటినా తెరిచే ఉంచడంతో చర్యలు
- అధిక సౌండ్ తో ఇబ్బంది పెట్టారంటూ స్థానికుల ఫిర్యాదు
కొత్త ఏడాది సందర్భంగా నిర్విహించే వేడుకలకు సంబంధించి పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు పబ్ లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ లు, వైన్స్ లకు అనుమతించారు. ఆ తర్వాత కూడా తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్ణీత సమయం దాటినా క్లోజ్ చేయని ఆరు పబ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.