చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్
- ఐఆర్ఆర్ కేసులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం
- శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించిన ఇరు పక్షాలు
- పరిశీలించి తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.