ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
- 9 వేలకు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్ లు
- చింతపల్లిలో ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్
- రెండేళ్లలో విద్యార్థులు, టీచర్లకు మొత్తం 9.53 లక్షల ట్యాబ్ లు
తాజాగా అందజేస్తున్న ట్యాబ్ లతో కలిపి రెండేళ్లలో 9,52,925 ట్యాబ్ లు (విద్యార్థులు, టీచర్లకు కలిపి) పంపిణీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. వీటి విలువ రూ.1,305.74 కోట్లు అని అధికారులు చెప్పారు. విద్యార్థులకు అందించిన ట్యాబ్ లలో ఇంటర్మీడియెట్ కంటెంట్ ను కూడా అప్ లోడ్ చేసేలా మార్పులు చేశామన్నారు. ఇందుకోసం ట్యాబ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచినట్లు తెలిపారు. ఈ ట్యాబ్ లను దుర్వినియోగం చేయకుండా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఇన్ బిల్ట్ గా పొందుపరిచామని చెప్పారు. ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యార్థుల యాక్టివిటీపై నిఘా పెడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.